‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన్ హీరోగా, జైక్రిష్ ప్రధాన పాత్రలో నిఖిల్.కె.బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రజాలం’. ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత నిఖిల్ మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ప్రేమకథ ఇది. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఉంటుంది. వినోదానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేస్తాం’ అన్నారు.