అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన థ్రిల్లర్ ప్రాజెక్ట్ హిట్ 2 (Hit :The second case). శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. శైలేష్‌కు రెండో బ్లాక్ బాస్టర్ అందించింది. ఈ సినిమా సెలబ్రిటీలను కూడా ఫుల్ ఇంప్రెస్ చేస్తోంది.
తాజాగా వెంకటేశ్ హిట్ 2 చూశాడు. ‘మీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా.. ఎవరు సినిమా వీక్షించారో చూడండి..’ అని శైలేష్ కొలను అంటుండగా బ్యాక్ నుంచి కెమెరా ముందుకొచ్చాడు వెంకీ. ‘శైలేష్ సినిమాను అద్బుతంగా తీశాడు. ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటుండటం ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్..’ అని చెప్పాడు వెంకీ.
ఇప్పటికే హీరో నందమూరి బాలకృష్ణ, తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి సినిమాను వీక్షించాడు. హీరో సుధీర్ బాబుతోపాటు పలువురు సెలబ్రిటీలు హిట్2ను చూసి ప్రశంసలు కురిపించారు. థ్రిల్లర్ జోనర్లో వచ్చిన హిట్ 2 చిత్రంలో తనికెళ్లభరణి, కోమలీ ప్రసాద్, రావు రమేశ్, భాను చందర్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జాన్ స్టివార్ట్ ఏడూరి సంగీతం అందించాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్నేని తెరకెక్కించారు.
సర్ప్రైజ్ సెలబ్రిటీ ఎవరంటే.. వీడియోపై ఓ లుక్కేయండి
The 'OG Super Police' @VenkyMama Garu appreciates the BLOODY BLOCKBUSTER 💥💥
A MAJOR VICTORY for Team #HIT2 🔥
Book your tickets now!
– https://t.co/8pMVvbIBsn
– https://t.co/JDVKuGhydj#BloodyBlockbuster@AdiviSesh @NameisNani @KolanuSailesh @tprashantii @walpostercinema pic.twitter.com/MXmTr0jXuX— BA Raju's Team (@baraju_SuperHit) December 6, 2022
Read Also :Mrunal Thakur | ఈ ఏడాది మృణాళ్ ఠాకూర్‌కు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Read Also :Narappa | మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో వెంకటేశ్ నారప్ప
Read Also :Mukhachitram | విశ్వక్సేన్ ముఖచిత్రం కొత్త అప్డేట్