కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే ఆలోచనతో హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైనా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న వైవిధ్యకథాచిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘నిజమేనా నిజమేనా.. నే విన్నది నిజమేనా’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఎమోషనల్ ఫీల్‌తో సాగే ఈ పాటను సనరే రాయగా, వంశీకాంత్ రేఖన స్వరపరిచారు. జయశ్రీ పల్లెం ఆలపించారు. ఈ చిత్రానికి కెమెరా: అక్షయ్రామ్ పొదిశెట్టి.