Sandeep Reddy Vanga | అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీలోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). విజయ్ దేవర కొండ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు నార్తిండియాను కూడా షేక్ చేసింది. కాగా ఇదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో కబీర్ సింగ్ టైటిల్‌తో తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగా. తెలుగుతో పోలిస్తే హిందీ వెర్షన్‌కు క్రేజ్ కొంచెం తక్కువగానే వచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ క్రేజీ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముంబైలో టాప్ ప్రొడక్షన్ కంపెనీ ఓ యాక్టర్ ఆడిషన్స్‌కు వెళ్తే నో చెప్పిందట. సదరు యాక్టర్ కబీర్ సింగ్ సినిమాలో నటించాడన్న కారణంతోనే ఆ ప్రొడక్షన్ కంపెనీ ఇలా చేసిందని చెప్పాడు సందీప్ రెడ్డి వంగా.
ఈ విషయమై ఓ చిట్‌చాట్‌లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. కబీర్ సింగ్‌లో నటించిన అతడు పాపులర్ యాక్టర్. ఓ సినిమా ఆడిషన్స్ కోసం ఆఫీస్‌కు వెళ్లాడు. ఆడిషన్స్ తర్వాత నువ్వు కబీర్‌సింగ్‌లో నటించావు కదా.. నిన్ను ఈ సినిమాలో మేము తీసుకోమని ప్రొడక్షన్ హౌస్ చెప్పింది. ఓ కొత్తబ్బాయి నాకు కాల్ చేసి ఇలా జరిగిందేంటి సార్ అంటే..నేను ఒకే లైట్ తీసుకో అన్నా. అయితే నువ్వు వారికి చెప్పు.. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణ్ బీర్ కపూర్‌తో సినిమా చేస్తున్నాడు. ఇదే విషయాన్ని రణ్ బీర్ కపూర్‌తో కూడా చెప్పమను. తృప్తి డిమ్రి, రష్మిక మందన్నాను కూడా తీసుకోవద్దని చెప్పు. ఆ పాట (యానిమల్ సినిమా సాంగ్) కంపోజ్ చేసిన విశాల్ మిశ్రాతో వర్క్ చేయొద్దని చెప్పానన్నాడు.
ఈ విషయం తనకు చాలా చిరాకు తెప్పించింది.. చెప్పడానికి నాకు మాటల్లేవన్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆ అబ్బాయి ఓ ప్రాంతం నుంచి వచ్చాడు.. నా వల్ల వచ్చిన చిన్న గుర్తింపు పొందాడు. అతను మరింత ముందుకెళ్లాలనుకుంటున్నాడంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
L2 Empuraan | గ్లోబల్ రేంజ్‌కు.. మోహన్‌లాల్ లూసిఫర్ 2లో హాలీవుడ్ స్టార్
Odela 2 | తమన్నా ఓదెల 2 సెలబ్రేషన్స్ టైం.. ఇంతకీ స్పెషల్ ఏంటో తెలుసా..?