Pushpa The Rise | జాతీయ అవార్డులు గెలుచుకోవడంలో పుష్ప సినిమాకు కలిసొచ్చిన అంశాలివే!
Pushpa The Rise | 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. ‘పుష్ప’ చిత్రం జాతీయ పురస్కారాల్లో సత్తా చాటడానికి అనేక అంశాలు కలిసొచ్చాయి. ఇందుకు అల్లు అర్జున్ అభినయం ప్రధాన కారణంగా నిలవగా, ఈ సినిమా పాటలు, మేకింగ్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
Pushpa The Rise | 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. ‘పుష్ప’ చిత్రం జాతీయ పురస్కారాల్లో సత్తా చాటడానికి అనేక అంశాలు కలిసొచ్చాయి. ఇందుకు అల్లు అర్జున్ అభినయం ప్రధాన కారణంగా నిలవగా, ఈ సినిమా పాటలు, మేకింగ్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా దుమ్మురేపింది. ఇక పాటలు దక్షిణాది అన్ని భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఉత్తరాదిన కూడా మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యాయి. ‘సామీ సామీ’ ‘ఏయ్ బిడ్డా’ ‘ఊ అంటావా మావ’ ‘దాక్కో దాక్కో’ ఇలా ప్రతీ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మాస్ అప్పీల్ బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
ఇక కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన పాత్రల్లో కనిపించడానికి ప్రాధాన్యతనిచ్చే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మరింతగా కష్టపడ్డారు. తొలిసారి డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్..ఇలా ప్రతీ అంశంలో ది బెస్ట్ అనిపించుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాతో ఆయన నేషనల్ స్టార్‌గా అవతరించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల వసూళ్లను సాధించింది.
Read More :
National Film Awards | వీళ్లు హీరోయిన్లా అని అవమానించారు.. వాళ్లే నేషనల్ అవార్డు కొట్టి చూపించారు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

