National Film Awards | వీళ్లు హీరోయిన్లా అని అవమానించారు.. వాళ్లే నేషనల్ అవార్డు కొట్టి చూపించారు..?
National Film Awards | ఒక్కరైనా మంచి నటి ఇండస్ట్రీలో ఉన్నారా అనే విమర్శలు వాళ్లపై రోజు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్లకు తమ నటనతోనే సమాధానం చెబుతుంటారు కొంతమంది హీరోయిన్లు. తాజాగా అలియా భట్ ( Alia Bhat ), కృతి సనన్ ( Kriti Sanon ) ఇదే చేసి చూపించారు.
National Film Awards | ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. అసలు వీళ్లు నటులేనా.. స్క్రీన్ మీద కనీసం వీళ్లని చూడటానికి ఏం అర్హత ఉంది.. ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ కూడా పలకడం లేదు అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు కొందరు నటులు. ఏదో వాళ్ల టైం బాగుంది కాబట్టి సినిమాలు నడుస్తున్నాయి.. అవకాశాలు వస్తున్నాయి అంతే.. అందులో వాళ్ల గొప్పతనం ఏమీ లేదు అని అవమానాలు ఎదుర్కొనే యాక్టర్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉంటారు. ఇక హీరోయిన్స్ అయితే అందాల ఆరబోత తప్ప వీళ్లకు ఏం తెలుసు.. ఒక్కరైనా మంచి నటి ఇండస్ట్రీలో ఉన్నారా అనే విమర్శలు వాళ్లపై రోజు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్లకు తమ నటనతోనే సమాధానం చెబుతుంటారు కొంతమంది హీరోయిన్లు. తాజాగా అలియా భట్ ( Alia Bhat ), కృతి సనన్ ( Kriti Sanon ) ఇదే చేసి చూపించారు.
బాలీవుడ్లో అలియా భట్ హీరోయిన్గా పరిచయమైనప్పుడు ఆమెపై వచ్చినన్ని విమర్శలు బహుశా ఎవరిపై రాలేదేమో. బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి హీరోయిన్ అయిపోయింది.. కనీసం ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ అయినా పలుకుతుందా ఈ అమ్మాయికి.. ఎవరిని పడితే వాళ్లని డబ్బులు ఉన్నాయి కదా అని హీరోయిన్లు చేసేస్తారా.. జనాల మీద రుద్దేస్తారా అంటూ ఆలియాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా వాటికి నోటితో కాకుండా తన నటనతో సమాధానం చెప్పింది అలియా భట్. అప్పట్లో హైవే.. ఆ తర్వాత రాజీ.. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్, గంగుబాయి కతియావాడి లాంటి సినిమాలలో అద్భుతమైన నటనతో తనలో ఎంత మంచి నటి దాగుందో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించింది. దాని ప్రతిఫలమే ఈరోజు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది అలియా.
మరోవైపు కృతి సనన్ కూడా అంతే. ఈమెనైతే అయితే ఇంకా దారుణంగా ఆడుకున్నారు. ఆలియాకైనా చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు ఉన్నాయి.. అసలు కృతికి ఏం సినిమాలు ఉన్నాయి.. గ్లామర్ షో తప్ప ఈమెకు నటించడం వచ్చా అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ వాళ్లందరికీ రెండేళ్ల కింద మిమి సినిమాతో సమాధానం ఇచ్చింది కృతి. ఇప్పుడు ఇదే సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది ఈ భామ. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఈ మొహాలను చూడటం కష్టం అన్న వాళ్లతోనే.. అబ్బా ఏం నటించార్రా అనిపించారు.. జాతీయ ఉత్తమ నటీమణులుగా తమ సత్తా చూపించారు. కెరీర్ లో చెప్పుకోవడానికి ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఏదైనా ఉంటుందా..?
Read More :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

