Dil Raju | పెద్ది రిలీజైతే మాకు వేరే ఆప్షన్ ఏం లేదు.. ‘గాయపడ్డ సింహం’ విడుదలపై దిల్ రాజు
Dil Raju | సోమవారం ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం’ (GaayaPadda Simham) మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రకటించారు. అంటే రాంచరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజైన మరుసటి రోజే.
Dil Raju | టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం’ (GaayaPadda Simham) ’Don’t Laugh… It’s a Serious Matter. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్లో ఈ మూవీ మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రకటించారు. అంటే రాంచరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజైన మరుసటి రోజే.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. కాగా ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. పెద్ది సినిమా అనుకున్న సమాయానికి అంటే ఏప్రిల్ 30న రాకుంటే మాత్రమే ‘గాయపడ్డ సింహం’ మే 1న థియేటర్లలో విడుదలవుతుందని అన్నాడు. గాయపడ్డ సింహం మే 1న విడుదల కానుంది. పెద్ది ఏప్రిల్ ౩౦ గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేశాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నేను గాయపడ్డ సింహం సినిమాకు థియేటర్లను కేటాయించలేనని టీం మెంబర్స్‌కు చెప్పాను.
విడుదల వాయిదా వేయడానికి అంగీకరించాలని నేను వారికి చెప్పాను. ప్రమోషన్స్‌కు సంబంధించిన ప్రతీ విషయం చాలా ముఖ్యం. అందువల్లే ఈవెంట్‌ను నేడు నిర్వహించాం. రాంచరణ్ పెద్ది అనుకున్న టైంకు విడుదలైతే గాయపడ్డ సింహం ఒక వారం ఆలస్యంగా రావొచ్చని.. మాకు మరొక ప్రత్యామ్నాయం లేదని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
ఈ మూవీలో విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీస్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also :
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

