THE PARADISE | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani). వీటిలో ఒకటి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న Nani Odela 2. చాలా రోజుల తర్వాత ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ టైటిల్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ది ప్యారడైజ్ (THE PARADISE) టైటిల్‌ను ఖరారు చేశారు.
ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల కలయికతో డిజైన్ చేసిన టైటిల్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ది ప్యారడైజ్‌లో హీరోయిన్, ఇతర నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, సాంకేతిక నిపుణుల వివరాలపై నాని టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ది ప్యారడైస్ చిత్రాన్ని 2025లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నాని మరోవైపు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ ప్రాంఛైజీ హిట్ 3లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ది ప్యారడైజ్ టైటిల్ లుక్..
VIOLENCE. BLOOD-SHED.
GUNS. GLORY.
ONE MAN.#NaniOdela2 is #THEPARADISE ❤️🔥
Natural Star @NameisNani @odela_srikanth @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/B6UbVUVKny
— BA Raju’s Team (@baraju_SuperHit) November 6, 2024
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్