సుదర్శన్, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘నటరత్నాలు’. శివనాగు దర్శకుడు. డా॥ దివ్య నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా శివనాగు మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అవన్నీ దాటుకొచ్చిన వాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుంది’ అన్నారు.