They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి ఓజీ. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా అభిమానుల కోసం ఏదో ఒక వార్తను షేర్ చేస్తున్నారు మేకర్స్. పవన్ కల్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎంగా తన విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు అభిమానుల కోసం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్.
ఈ మూవీ చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో ఓజీ షూటింగ్ జరుగుతుందని తెలియజేసే.. భారీ నౌకతోపాటు ఎయిర్ పోర్టు, స్టైలిష్ కారు స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్యాంకాక్ షూట్ లొకేషన్లో సుజిత్ ఉన్న స్టిల్‌ను షేర్ చేశారు మేకర్స్. బ్యాంకాక్‌లో నిజమైన హీట్.. అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. సుజిత్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని ఈ స్టిల్ చూసిన మూవీ లవర్స్, అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
మేకర్స్ ఇప్పటికే చాలా రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓజీ HUNGRYCHEETAH గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ పూర్తిగా నయా అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
The heat is real in BANGKOK….😉🔥#TheyCallHimOG #OG pic.twitter.com/RCH0UUE3R8
— DVV Entertainment (@DVVMovies) December 9, 2024
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్