‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ఈ సినిమా టీజర్ చల్లటిగాలి మనసుని హత్తుకున్నట్లుగా ఆసక్తికరంగా ఉంది’ అని విజయ్ దేవరకొండ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రబృందాన్ని అభినందించారు. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో. ఈ మండలంలో బర్త్‌డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయిన మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ వినోదాత్మకంగా సాగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఈవెంట్ నేపథ్యంలో నాయకానాయికల మధ్య నడిచే ప్రేమకథ..ఈ క్రమంలో పండే వినోదంతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.సోమశేఖర్, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాత: సందీప్ అగరం, ఆస్మితా రెడ్డి బాసిని, రచన-దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్.