The Goat | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో దళపతి 68 (Thalapathy 68)గా వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన The GOAT పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సెన్సార్ అప్డేట్ అందించారు.
ది గోట్ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. యూనివర్సల్ ఆడియెన్స్ కోసం సెన్సార్ అయింది.. అంటూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. వెంకట్ ప్రభు అండ్ విజయ్ టీం సరికొత్తగా డిజైన్ చేసిన పోస్టర్ల ద్వారా చేస్తున్న ది గోట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కాలం, రోడ్డు, విమానం, పారాచూట్, ట్రైన్, టవర్స్ బిల్డింగ్స్ థీమ్‌తో ది గోట్ పోస్టర్లను రెడీ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది గోట్‌ను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విజయ్ మరోవైపు హెచ్ వినోథ్ దర్శకత్వంలో దళపతి 69కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ ప్రొడక్షన్ తెరకెక్కించనుంది.
Censor U/A for #TheGOAT Universal Audience .
ANNE VARAR VAZHI VIDU 🔥@actorvijay Sir
A @vp_offl Hero
A @thisisysr Magical #TheGreatestOfAllTime#ThalapathyIsTheGOAT#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh @Ags_production@archanakalpathi @aishkalpathi… pic.twitter.com/A8FHmQOog2— AGS Entertainment (@Ags_production) August 21, 2024
Mahesh Babu | ముఫాసా: ది లయన్ కింగ్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్.. ఇంతకీ ఏ పాత్రకో తెలుసా..?
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!