Nagabandham | టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించి వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్‌గా నిలిచిన వారిలో ఒకరు అభిషేక్ నామా. డెవిల్ తర్వాత ఈ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నుంచి వస్తున్న చిత్రం నాగబంధం (Nagabandham). అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణల స్పూర్తిగా వస్తోన్న ఈ చిత్రంలో పెదకాపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ఈ మూవీ క్లైమాక్స్ ఇదివరకెన్నడూ లేని విధంగా చిత్రీకరిస్తున్నారట. తాజా టాక్ ప్రకారం ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ రామానాయుడు స్టూడియోస్‌లో నిర్మించిన అద్భుతమైన మైథలాజికల్ సెట్లో క్లైమాక్స్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే విజువల్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచరస్ కొరియోగ్రఫర్ Kecha Khamphakdee ఈ హై ఆక్టేన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నభానటేశ్, ఐశ్వర్య మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్, తారక్ సినిమాస్ బ్యానర్లపై అభిషేక్ నామా, కిశోర్ అన్నపురెడ్డి, లక్ష్మి ఐరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. నాగబంధం చిత్రాన్ని 2026లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
The climax of #Nagabandham is turning into a never-seen-before spectacle! 🔥🐍
A massive ₹20 Cr finale is currently being shot on an extraordinary mythological set crafted by Production Designer Ashok Kumar at Ramanaidu Studios.
Global action wizard #KechaKhamphakdee is… pic.twitter.com/768jJeENOM
— Ramesh Bala (@rameshlaus) December 3, 2025
Ravi Teja | తండ్రి పాత్రలో రవితేజ.. శివ నిర్వాణ మూవీ టైటిల్ ఇదేనట..!
Akhanda 2 | అఖండ 2లో బోయపాటి శ్రీను కుమారుడు.. పాత్ర ఏంటో డైరెక్టర్ క్లారిటీ..!
Rana | దీపికా పదుకొణే వ్యాఖ్యల దుమారం… హాట్ టాపిక్‌గా రానా-దుల్కర్ రియాక్షన్స్