Ravi Teja | టాలీవుడ్లో కథను నమ్మి సినిమా చేసే డైరెక్టర్లలో ఒకరు శివ నిర్వాణ. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా.. మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత శివ నిర్వాణ టాలీవుడ్ యాక్టర్ రవితేజతో సినిమా చేస్తున్నాడంటూ ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఈ చిత్రానికి ఇరుముడి టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా ఫైనల్ కాగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
రవితేజ అంటే మాస్ అప్పీల్, ఎనర్జిటిక్ డ్యాన్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్..ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలిసిందే. అయితే రవితేజ ఈ సారి మాత్రం రూటు మార్చి థ్రిల్లర్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, రవితేజ కాంబినేషన్లో ఇప్పటికే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం వచ్చింది. మరోవైపు ఇదే ప్రొడక్షన్ హౌజ్‌లో ఖుషి మూవీ చేశాడు శివ నిర్వాణ. ఇక ఈ ఇద్దరినీ ట్రాక్‌పైకి తీసుకొస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
Rana | దీపికా పదుకొణే వ్యాఖ్యల దుమారం… హాట్ టాపిక్‌గా రానా-దుల్కర్ రియాక్షన్స్
Imdb Most Popular Indian Stars of 2025 | ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ తారలు వీరే.!
Samantha- Raj | సమంత-రాజ్ వివాహానికి వచ్చిన అతిథులకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ ఏంటో తెలుసా?