Siddharth | ఈ ఏడాది ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సిద్దార్థ్ (Siddharth) . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. తాజాగా మిస్‌యూ (Miss You) అంటూ తెలుగు ఆడియెన్స్‌ను పలుకరించబోతున్నాడు. సిద్దార్థ్, ఆషికా రంగనాథ్ నటిస్తోన్న మిస్‌యూ నవంబర్ 29న తెలుగులో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది సిద్ధార్థ్ టీం.
మీ సినిమా విడుదలైన వారానికే పుష్ప 2 ది రూల్ (Pushpa 2 Th eRule) థియేటర్లలో వస్తుంది. భయం లేదా.. ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా ఏడు రోజుల తర్వాత రెండో వారంలో కూడా నా సినిమా థియేటర్లలో ఉండాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో మొదట నా సినిమా బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలి. ఇక వేరే సినిమా గురించి ప్రేక్షకులు ఆలోచించాలి.. ఆందోళన చెందాలి. అది నా సమస్య కాదు. నా సినిమా బాగుంటే థియేటర్లలో ఉంటుంది. సోషల్ మీడియా అవగాహన ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ఒక మంచి సినిమాను థియేటర్ల నుండి తీసివేయలేరంటూ ధీమాగా చెప్పుకొచ్చాడు.
మిస్ యూ సినిమాపై పుష్ప 2 ఎలాంటి ప్రభావం చూపదని ధీమా వ్యక్తం చేశాడు సిద్ధార్థ్. నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతా..ఆలోచిస్తా. టెన్షన్ అయిపోతా.. నా కంట్రోల్లో లేని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. ప్రతీ సినిమా పెద్ద సినిమానే. మీరెంత ఖర్చు పెట్టామనే దానితో పెద్ద సినిమా, చిన్న సినిమా అని చెప్పకూడదని కోరాడు సిద్దార్థ్. పాన్ ఇండియా స్టార్ సినిమాతో తనకెలాంటి ఇబ్బంది లేదని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతూ మిస్‌యూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
If We Made a GOOD FILM means Others Needs to be FEAR Not Me – #Siddharth about #Pushpa2TheRule 😳😳😳🔥🔥🔥 pic.twitter.com/NXsqdhNLaV
— RAJU_PRABHAS123 (@chilivuri590) November 26, 2024
Photos: #Siddharth‘s #MissYou Pre-Release Press Meet ✨#MissYouMovie In theatres from November 29th 💖
#MissYouMovie #MissYouOnNov29 pic.twitter.com/dGX55ipdns
— Sreedhar Sri (@SreedharSri4u) November 26, 2024
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా