దర్శకత్వంతో పాటు నటనలో కూడా రాణిస్తున్నారు తరుణ్‌భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషారెబ్బా కథానాయిక. ఎ.ఆర్.సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 1న విడుదలకానుంది. శనివారం కాన్సెప్ట్ వీడియోతో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్‌భాస్కర్ పాత్రల్ని పరిచయం చేశారు. పెళ్లి తర్వాత దంపతుల మద్య వచ్చే వాగ్వాదాలు, గొడవలతో కాన్సెప్ట్ వీడియో ఆసక్తికరంగా సాగింది. బ్రహ్మానందం, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్, నిర్మాతలు: సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్షేక్, నవీన్ సనివరపు, రచన-దర్శకత్వం: ఎ.ఆర్.సజీవ్.