Priyadarshi | మీ గెలుపు స్ఫూర్తిని పంచుకున్నందుకు ధన్యవాదాలు అన్నా.. ఆర్సీ 15 సెట్స్‌లో ప్రియదర్శి
ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం బలగం (Balagam). సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బలగం టీం రాంచరణ్ (Ram Charan) నటిస్తోన్న ఆర్సీ 15 మూవీ సెట్స్ కు వెళ్లింది.
ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం బలగం (Balagam). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. వేణు ఎల్దండి దర్శకత్వ ప్రతిభపై మూవీ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బలగం టీం రాంచరణ్ (Ram Charan) నటిస్తోన్న ఆర్సీ 15 మూవీ సెట్స్ కు వెళ్లింది.
ఈ సందర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. రాంచరణ్‌తో బలగం టీం దిగిన ఫొటోను ప్రియదర్శి షేర్ చేస్తూ..బిజీ షెడ్యూల్లో కూడా బలగం సినిమా పట్ల మీ ఉత్సాహాన్ని షేర్ చేసుకుంటూ.. ప్రశంసలు అందిస్తూనే.. మీ గెలుపు స్ఫూర్తిని, పాజిటివ్ ఎనర్జీని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రాంచరణ్ అన్నా. ఈ అరుదైన క్షణంలో గ్లోబర్ స్టార్ రాంచరణ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. అని తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.
అదేవిధంగా సెట్స్ లో యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రియదర్శి, వేణు, కావ్య కళ్యాణ్ రామ్ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని షేర్ చేస్తూ.. ఓ లెజెండ్ ఒక్క నిమిషం ఆగి.. మన పనికి ప్రశంసల వర్షం కురిపించడం.. ఇంతకంటే మేం ఏం అడగాలి. మీ మద్దతుకు ధన్యవాదాలు సార్ ట్వీట్ చేశాడు ప్రియదర్శి .
స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఆర్సీ 15 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ-రాంచరణ్‌పై వచ్చే సాంగ్‌ను షూట్ చేస్తోంది టీం. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో రాజోలు భామ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
Thank you @AlwaysRamCharan anna for sharing your winning spirit and positive energy while sharing your enthusiasm and appreciation for #Balagam amidst a busy schedule. My heartfelt gratitude to my #GlobalStar for this unforgettable moment. Love you anna 🤗 pic.twitter.com/F9jTcJAc14
— Priyadarshi Pulikonda (@Preyadarshe) March 20, 2023
When a legend pauses for a minute and showers praises for our work – what else can we ask for!
Thank you so much @PDdancing sir for your wishes and support for #Balagam
We are all dancing to #Mukkala 🤗#HeartIsFull pic.twitter.com/pO269fco7X— Priyadarshi Pulikonda (@Preyadarshe) March 20, 2023
Read Also :
Ravanasura | రవితేజ మాస్ ఎనర్జిటిక్ వైబ్‌తో రావణాసుర కొత్త సాంగ్.. టైం ఫిక్స్
Pushpa : The Rule | పుష్ప : ది రూల్ యాక్షన్ టీజర్ రెడీ.. క్రేజీ టాక్‌లో నిజమెంత !
Rangamarthanda | 40 అడుగుల భారీ కటౌట్స్.. రంగమార్తాండ టీం స్పెషల్ ప్లాన్..!
Gaami | గామి రిలీజ్ టైం ఫిక్స్.. విశ్వక్ సేన్ నయా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

