సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం రంగమార్తాండ (Rangamarthanda). ఈ మూవీ మరాఠీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నట సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. రంగమార్తాండ మార్చి 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
లీడ్ యాక్టర్లకు ఇదివరకెన్నడూ దక్కని గౌరవాన్ని అందించే విధంగా రంగమార్తాండ స్టార్ల కటౌట్స్ ఏర్పాటు చేసే పనిలో మేకర్స్ టీం బిజీగా ఉందట. తాజా అప్డేట్ ప్రకారం రంగమార్తాండకు మెయిన్ పిల్లర్స్ అయిన ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతోపాటు డైరెక్టర్ కృష్ణవంశీల 40 అడుగుల కటౌట్స్‌ను రేపు సాయంత్రం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని శాంతి థియేటర్ వద్ద ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. సినిమా హీరో, డైరెక్టర్‌కు ఇలాంటి కటౌట్స్ పెట్టడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఈ సారి మాత్రం రంగమార్తాండ సినిమాకు ప్రాణం పోసే ప్రతీ పాత్రను గౌరవించేలా మేకర్స్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడం ప్రత్యేకమనే చెప్పాలి.
ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హౌస్‌ఫుల్ మూవీస్-రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. రంగమార్తాండకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రంగమార్తాండ సినిమాకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి షాయరీ (కవితాఝరి) అందించిన విషయం తెలిసిందే.
Ravanasura | రవితేజ మాస్ ఎనర్జిటిక్ వైబ్‌తో రావణాసుర కొత్త సాంగ్.. టైం ఫిక్స్
Pushpa : The Rule | పుష్ప : ది రూల్ యాక్షన్ టీజర్ రెడీ.. క్రేజీ టాక్‌లో నిజమెంత !
Gaami | గామి రిలీజ్ టైం ఫిక్స్.. విశ్వక్ సేన్ నయా అప్డేట్