Gaami | గామి రిలీజ్ టైం ఫిక్స్.. విశ్వక్ సేన్ నయా అప్డేట్
విశ్వక్ సేన్ నటిస్తున్న దాస్ కా ధమ్ కీ (Das ka Dhamki) మార్చి 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ కాంపౌండ్ నుంచి ఇప్పటికే విడుదల కావాల్సిన గామి (Gaami) సినిమా అప్డేట్ చాలా కాలానికి బయటకు వచ్చింది.
Vishwak Sen | విశ్వక్ సేన్ ప్రస్తుతం దాస్ కా ధమ్ కీ (Das ka Dhamki) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్‌గా విశ్వక్సేన్కు ఇది రెండో సినిమా. ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ కాంపౌండ్ నుంచి ఇప్పటికే విడుదల కావాల్సిన గామి (Gaami) సినిమా అప్డేట్ చాలా కాలానికి బయటకు వచ్చింది.
తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం గామి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గామి చిత్రం ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని, మరో రెండు నెలల్లో థియేటర్లలో విడుదలవుతుందని తెలిపాడు విశ్వక్ సేన్. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.
ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. మరోవైపు విశ్వక్ సేన్ 20వ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
Read Also :
Ravanasura | రవితేజ మాస్ ఎనర్జిటిక్ వైబ్‌తో రావణాసుర కొత్త సాంగ్.. టైం ఫిక్స్
Pushpa : The Rule | పుష్ప : ది రూల్ యాక్షన్ టీజర్ రెడీ.. క్రేజీ టాక్‌లో నిజమెంత !
Rangamarthanda | 40 అడుగుల భారీ కటౌట్స్.. రంగమార్తాండ టీం స్పెషల్ ప్లాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

