Thalapathy 69 | తమిళ అగ్ర నటుడు విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమా సక్సెస్‌లో ఉన్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దళపతి 69 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన తమిళం హక్కులను కూడా మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుందని టాక్. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Also Read..