Thalapathy 69 | ది గోట్ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay). ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ దళపతి 69 (Thalapathy 69) అప్డేట్ రానే వచ్చింది. ఈ చిత్రానికి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించనున్నాడు.
దశాబ్దాలుగా మనకు వినోదాన్ని అలరించిన వ్యక్తి ఎప్పటికీ నిలిచిపోయే వేడుకలను జరిపేందుకు చివరి క్షణంలో అడుగుపెడుతున్నాడు. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటన రాబోతుంది.. కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో దళపతి 69 వివరాలు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రకటించబోతున్నామని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. విజయ్ సినిమాటిక్ జర్నీతో డిజైన్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని.. మరోసారి విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు తెలుస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఇదే చివరి కానుందని తెలిసిందే.
The one who entertained us for decades is stepping in ONE LAST TIME to create celebrations that will last forever 💥💥
The most awaited announcement is here…❤️#Thalapathy69 will be made under @KVNProductions ❤️🔥
Project details will be unveiled tomorrow at 5:00 PM 🔥🔥
▶️… pic.twitter.com/FCjYMrca3W
— BA Raju’s Team (@baraju_SuperHit) September 13, 2024
Nandamuri Balakrishna | వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ భారీ విరాళం
Pawan Kalyan | జెట్టీ యాక్టర్ కృష్ణకు పవన్ కల్యాణ్ ప్రశంసలు.. కారణమిదే.. !
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!