Nandamuri Balakrishna | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ( Ap Floods) వరద ముంపునకు గురయ్యారని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతోపాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు భారీ ఎత్తున ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.
తాజాగా తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ప్రకటించిన విరాళాలను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అందజేయనున్నారు.
వరద బాధితుల సహాయర్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షలు విరాళంగా అందించిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు .
నందమూరి బాలకృష్ణ గారి తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి
50లక్షలు చెక్కు ను అందజేసిన తేజస్విని గారు. #NandamuriBalakrishna #RevanthReddy #Tejeswini pic.twitter.com/QR2rvPDYVh— manabalayya.com (@manabalayya) September 13, 2024
– మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– మహేశ్‌బాబు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం
– త్రివిక్రమ్, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ కలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 25 లక్షల చొప్పున విరాళం
– సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 15 లక్షల చొప్పున 30 విరాళం
– విశ్వక్సేన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల విరాళం
– వైజయంతీ మూవీస్ రూ.45 లక్షలు విరాళంగా ప్రకటించింది
– ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు ప్రకటించింది. స్టార్ యాక్టర్ రాంచరణ్ రూ.కోటి విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించాడు.