Mithra Mandali | ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మిత్రమండలి (Mithra Mandali). సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎం ఈ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది.
కామెడీ డ్రామా నేపథ్యంలో వచ్చిన మిత్రమండలి డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలోకి కూడా వచ్చేసింది. అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఇక టెలివిజన్ ప్రేక్షకుల దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి టీవీలోకి వస్తోంది. జీ తెలుగు ఛానల్లో ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రసారం కానుంది. మరి ఈ మూవీ టీవీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
ప్రైమ్ వీడియో ఇండియా చార్ట్స్‌లో మిత్రమండలి ఐదవ స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. మేకర్స్ కొన్ని పోర్షన్లు తొలగించి రీఎడిటెడ్ వెర్షన్‌ను డిజిటల్లో విడుదల చేశారు. మిత్రమండలి చిత్రాన్ని బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?