Telugu directors | సోషల్ మీడియాలో ఫన్, ట్రోలింగ్ కంటెంట్‌తోపాటు మూవీ లవర్స్‌ను ఖుషీ చేసే అంశాలు కూడా సందడి చేస్తుంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి తెలుగు డైరెక్టర్ల (Telugu directors)పై నెట్టింట చర్చ జోరుగానే నడుస్తుంటుంది. అందులోనా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ సక్సెస్ ట్రాక్‌పై ఉన్న డైరెక్టర్ల గురించి ఏదో టాక్ నడుస్తూనే ఉంటుంది.
ఇంతకీ ఈ టాపిక్ రావడానికి కారణమేంటనుకుంటున్నారా..? ఈ మధ్యకాలంలో సక్సెస్ కొట్టిన దర్శకులు ఒకే రూట్లో వెళ్తుండటమే.. తాము అనుకున్నది నెరవేరితే ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఇదే రూటులో ముగ్గురు దర్శకులు స్వామివారిని దర్శించుకుని వార్తల్లో నిలిచారు. యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga ) తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు.
కల్కి 2898 ఏడీ సూపర్ హిట్‌గా నిలువడంతో నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా తలనీలాలు అర్పించగా.. మరోవైపు లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ టైంలో వెంకీ అట్లూరి(Venky Atluri) కూడా గుండు చేయించుకున్నాడు. ఇలా ముగ్గురు దర్శకులు సినిమా విజయం అందుకున్న వేళ గుండుతో కనిపిస్తున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?