అమెజాన్ ప్రైమ్‌లో జాతిరత్నాలు .. ఎప్పుడంటే..?
అమెజాన్ ప్రైమ్‌లో జాతిరత్నాలు | నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. 25 రోజుల్లో దాదాపు రూ.40 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా.

2021లో మోస్ట్ సర్ప్రైజింగ్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి జాతిరత్నాలు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి రాణించింది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి అనుదీప్ దర్శకత్వంలో జాతి రత్నాలు సినిమాను నిర్మించాడు. టీజర్ విడుదలైనప్పుడే సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి సంచలన వసూళ్లు సాధించింది. రెండు వారాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడింది జాతిరత్నాలు. ఉప్పెన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ కొత్త ఊపిరి పోసింది ఈ సినిమా. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. 25 రోజుల్లో దాదాపు రూ.40 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించారు జాతిరత్నాలు. చిన్న సినిమాల్లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది జాతి రత్నాలు. ఈ సినిమాకు దాదాపు రూ.40 కోట్లకు పైగానే లాభాల వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో థియేటర్లో మిస్ అయిన వాళ్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది.
మరో నాలుగు రోజుల్లో జాతిరత్నాలు మన ఇంటికి రాబోతున్నారు. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో జాతిరత్నాలు సినిమా ప్రసారం కానుంది. దాంతో థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు జాతిరత్నాలు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అమెజాన్‌లో కూడా జాతిరత్నాలు రికార్డు వ్యూస్ సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అవుట్ అండ్ అవుట్ ప్లాస్టర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమా చూస్తే సరిపోతుంది అని పదే పదే చెబుతున్నారు మేకర్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతుంటే ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో హల్చల్
జల్సా సినిమా గుర్తు చేస్తున్న వకీల్ సాబ్ కొత్త పోస్టర్
వకీల్ సాబ్ ప్రమోషన్లో శృతి హాసన్ కనిపించడం లేదే..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
రష్మిక రిక్వెస్ట్..ఒకే చెప్పిన అల్లు అర్జున్
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
మళ్లీ ఏడిపించడానికి ఫిక్స్ అయిన శివ నిర్వాణ
విజయ్ ‘లైగర్’కు జాకీచాన్ యాక్షన్ డైరెక్టర్
విజయ్ దేవరకొండ కోసం పద్ధతులు మార్చుకున్న పూరీ జగన్నాథ్..
నటి హరితేజకు పండంటి పాపాయి
సుకుమార్ అసిస్టెంట్ స్టోరీకి మెగా హీరో ఇంప్రెస్..!
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
లాక్డౌన్ పెళ్లి వినోదాలు
పుష్పరాజ్ డబ్బింగ్ షురూ చేశాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

