తెలంగాణ ప్రభుత్వం మూవీ లవర్స్ కు ఊరటనిచ్చే అప్ డేట్ అందించింది. వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న గని (Ghani)సినిమా టికెట్స్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్ (multiplexes )లలో గని టికెట్ దర జీఎస్టీ సహా రూ.200గా ఖరారు చేసింది. మరోవైపు సింగిల్ థియేటర్ల (single screens)లో టికెట్ ధరలను జీఎస్టీ సహా రూ.150గా నిర్ణయించింది. ఇటీవలే రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టికెట్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమా కావడంతో తదనుగుణంగా పెంచిన ధరలు ఆర్ఆర్ఆర్ మేకర్స్ కలిసొచ్చాయి.
ఈ ధరలతో చిన్న, మాధ్యమిక బడ్జెట్ సినిమాలకు అంతగా లాభం ఉండదు. దీంతో ప్రభుత్వం ధరలను తగ్గించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న గని చిత్రంలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్గా నటిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది గని. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే విశాఖపట్నంలో నిర్వహించారు.
బాక్సర్‌గా కనిపించడం కోసం వరుణ్ తేజ్ ఇంగ్లాండ్ మాజీ బాక్సర్, 2008 సమ్మర్ ఒలింపిక్స్ రజత పతక విజేత టోనీ జెఫ్రీస్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి (Sunil Shetty), జగపతిబాబు, నవీన్‌చంద్ర, నరేశ్ కీలక పాత్రలు చేస్తున్నారు.