Telangana Cinema Ticket rates | సినిమా టికెట్ల రేట్లపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హర్షం వ్యక్తం చేసింది. జీవో నెం.120 అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సునీల్ నారంగ్.. టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
సినిమా టికెట్లను అధిక ధరలకు విక్రయించవద్దని నిర్మాతలను ఈ సందర్భంగా సునీల్ నారంగ్ విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమాలను 50 నుంచి 150 రూపాయల టికెట్ ధరలతో అమ్ముకోవచ్చని సూచించారు. శుక్రవారం పలు థియేటర్లలో అధిక ధరలకు టికెట్లను అమ్మడం తమ దృష్టికి వచ్చిందని చెప్పిన ఆయన.. వెంటనే స్పందించి ఆ రేట్లను సవరించి మిగతా డబ్బును వారి అకౌంట్లలోకి రీఫండ్ చేశామని తెలిపారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కొత్త జీవోలో పేర్కొన్న విధానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పలు థియేటర్స్‌లోని క్యాంటిన్లలో కూడా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని కూడా సవరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు.
ప్రతి ఒక్క సినిమాకు లాభం జరగాలన్నదే జీవో నెం.120 ఉద్దేశమని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి తెలిపారు. ఈ జీవో ప్రకారం చిన్న సినిమాలను మినిమం రేట్లకు, మీడియం సినిమాలను మొదటి రెండు వారాలు గరిష్ట ధరకు.. ఆ తర్వాత కనిష్ట ధరకు అమ్మాలని సూచించారు. వైస్ ప్రెసిడెంట్ బాలగోవింద్ రాజ్ మాట్లాడుతూ.. గత ఐదారేండ్లుగా ఇవే రేట్లను కోర్టు ద్వారా తెచ్చుకోవడం జరిగిందని గుర్తుచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శానా కష్టం అంటున్న చిరంజీవి.. ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్..
Rajamouli | అజిత్ చేసిన పనికి ఫిదా అయిపోయిన రాజమౌళి..
Arjuna Phalguna | అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ
Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!
Vishwak sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్..
అందరూ మర్చిపోయిన వరుణ్ సందేశ్‌ను ఆ సినిమా గుర్తు చేస్తుందా..?