Teja Sajja | హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్నాడు యంగ్ యాక్టర్ తేజ సజ్జా (Teja Sajja). ఈ టాలెంటెడ్ యాక్టర్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు మిరాయి (Mirai) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని తెలిసిందే.
పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని 2025 సెప్టెంబర్ 5న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ షురూ అయ్యాయి.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు తేజ సజ్జా. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశాడు. తేజ సజ్జా తన లక్ష్యం స్టార్ అవడం కాదన్నాడు. మెగాస్టార్లు దశాబ్ధాలుగా తయారవుతారని తేజ సజ్జా అభిప్రాయపడ్డాడు.
హనుమాన్ తర్వాత నా లక్ష్యాలు మారిపోయాయి. నేను ఓ స్టార్ అవాలనుకోవడం లేదు. నాకు ప్రత్యేకించి యువ ప్రేక్షకులపై ప్రభావం చూపించే సినిమాలు తీయాలనుంది. ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత కూడా జనాలు నన్ను జాంబిరెడ్డి యాక్టర్‌గానే గుర్తుంచుకుంటారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మిరాయి చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా.. గౌరా హరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందని వస్తున్న వార్తలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
Manchu Lakshmi | బెట్టింగ్ యాప్ కేసు.. ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ
Jalsa 4k | పవన్ కల్యాణ్ బర్త్‌డే స్పెషల్.. మరోసారి థియేటర్లలో ‘జల్సా’