Manchu Lakshmi | బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) నేడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయం ముందుకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు మూడు గంటల పాటు లక్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్రమోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవిలతో పాటు ఇతర అంశాలపై లక్ష్మి స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. అలాగే యాప్ ప్రమోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. అనంతరం తన బ్యాక్ స్టేట్మెంట్లను లక్ష్మి ఈడీకి అందించింది. ఇక విచారణ అనంతరం లక్ష్మి ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా విచారణకు రావాలని మంచు లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు.