Jalsa Re Release | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా (సెప్టెంబర్ 2) ఆయన అభిమానుల కోసం ‘జల్సా’ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. గతంలో 2022లో కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జల్సా’ సినిమాను 4K వెర్షన్లో రీ-రిలీజ్ చేశారు. అయితే అప్పుడే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రీ-రిలీజ్ సినిమాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఈ సినిమాను మళ్లీ చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతుండడంతో సెప్టెంబర్ 02న రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
#Jalsa4K Re-Releasing on September 2nd! 😎
Powerstar @PawanKalyan’s Birthday Special Shows ❤️🔥#Jalsa #AlluAravind #Trivikram #Ileana @ThisIsDSP @prakashraaj #ASreekarPrasad #KVGuhan #RasoolEllore @GeethaArts @adityamusic pic.twitter.com/QvHUh7SRlO
— Geetha Arts (@GeethaArts) August 13, 2025