Mirai | హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజసజ్జా (Teja Sajja). ఈ టాలెంటెడ్ యాక్టర్ పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయి ( Mirai) చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికానాయక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తేజ సజ్జా బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇంటెన్స్ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. తేజ సజ్జా ఎత్తైన భవంతిపై నుంచి ఓ ఐరన్ రాడ్‌ను పట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎడ్రినలిన్ రైడ్ ఫీల్ అందించే సూపర్ యోధ జననం.. అంటూ విడుదల చేసిన తాజా లుక్‌తో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేయడం పక్కా అని అర్థమవుతోంది.
ఈ మూవీలో మంచు మనోజ్ (Manchu Manoj) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మంచు మనోజ్ మిరాయి లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గౌరా హరి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 18న 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Strap in for an adrenaline ride 😎
The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the
SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP
— People Media Factory (@peoplemediafcy) August 23, 2024
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్
They Call Him OG | ఓజీ టీం బ్యాక్ ఆన్ మిషన్.. ట్రెండింగ్‌లో సుజిత్, పవన్ కల్యాణ్ స్టిల్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని