Simbu | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ శింబు (Simbu). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, శింబు కాంబోలో అరసన్ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ శింబు 49వ చిత్రంగా వస్తోంది. సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపింనుందని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా ఈ మూవీ తెలుగులో కూడా సందడి చేయనుంది. తెలుగులో సామ్రాజ్యం టైటిల్‌తో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర అప్డేట్ను మేకర్స్ షేర్ చేసుకున్నారు. రేపు ఉదయం 10:07 గంటలకు ప్రోమోను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్ .
అంతేకాదు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ఈ ప్రోమోను రాబోతున్నట్టు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. తమిళ వెర్షన్ ప్రోమో కూడా ఆన్లైన్లో విడుదల కానుంది. వీ క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతున్నట్టు సమాచారం.
కాగా శింబు పాపులర్ తెలుగు లీడింగ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ తో తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. Manasanamaha షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ రెడ్డి ఇటీవలే నిర్మాతకు ఓ స్క్రిప్ట్ వినిపించగా ఇంప్రెస్ అయిపోయాడట. చర్చలు కూడా ఓ దశకు వచ్చేశాయని.. శింబు కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది.
Read Also :
Rahul Sankrityan | వీడి14లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు : రాహుల్ సంకృత్యాన్
Khalifa Glimpse | పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్‌డే స్పెషల్.. ‘ఖలీఫా’ గ్లింప్స్ విడుదల
Nagarjuna | నాగార్జున 100వ సినిమాపై క్రేజీ అప్డేట్.. టబు స్థానంలో లేడి సూపర్ స్టార్?