Prithviraj Sukumaran | మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు డబుల్ ట్రీట్ అందింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఖలీఫా’ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ది బ్లడ్‌లైన్’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్‌లో పృథ్వీరాజ్ ‘ఆమిర్ అలీ’ అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. వైశాఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జిను వి. అబ్రహం, సూరజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఓనం సందర్భంగా 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.