Vijay Deverakonda | ఇటీవలే కింగ్డమ్ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వీడి14. ఈ సినిమాకు టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాయలసీమ నేపథ్యంలో 1854 – 1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. దీంట్లో విజయ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. మైత్రీ బ్యానర్లో రాబోతున్న డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన రాహుల్ వీడీ14 అప్డేట్ను పంచుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూడబోతున్నారు అంటూ కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#VD14 🔥🔥
@TheDeverakonda pic.twitter.com/MZ06sZcjX7— 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐊𝐮𝐦𝐚𝐫 (@Kishore_VD) October 15, 2025