Thandel | నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో మత్య్స కారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా పబ్లిసిటి ఇటీవల ఊపందుకుంది. కానీ ఎందుకో ఈ సినిమాకు తగ్గ బజ్ రాలేదేమో అని అక్కినేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
నాగచైతన్యతో పాటు హీరోయిన్ సాయి పల్లవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమా మరో బలం. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది. అయితే ట్రైలర్ బాగుందనిపిస్తున్నా.. కానీ ఎక్కడో ఎదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చిత్ర దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాస్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయినా కూడా ఎదో తెలియని పబ్లిసిటి వెలితి ఈ సినిమాకు కనిపిస్తుంది.
ఈ సినిమా ప్రచారం విషయంలో ఎదో మ్యాజిక్ జరగాలి.. సినిమాకు మంచి ప్రారంభ వసూళ్లు దక్కాలంటే ఇంకాస్త జనాల్లోకి వెళ్లాలి.ముఖ్యంగా అందరికి పెద్దగా తెలియని ‘తండేల్’ లాంటి టైటిల్‌కు జనాలకు రీచ్ అవ్వాలంటే పబ్లిసిటి సౌండ్ మరింత పెంచాల్సిందేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిర్మాతలు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే చెన్నయ్, బెంగళూరు, ముంబయ్‌లో కూడా ఈవెంట్ నిర్వహించారు. కానీ తెలుగు పబ్లిసిటిలో మరింత ఊపు పెంచాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే త్వరలోనే ఈ చిత్రం ప్రీరీలీజ్ వేడుకకు కథానాయకుడు అల్లు అర్జున్ హాజరుకాబోతున్నాడని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఆయన రాకపోవడం కూడా సినిమా బజ్కు మైనస్‌గా మారింది. కనీసం ఇప్పుడైన తండేల్‌ను జనాలకు రీచ్ కావాలంటే పబ్లిసిటి మరింత పెంచాల్సిందే.
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?