Babli bouncer | విభిన్న కథలతో నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సినీరంగంలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి తమన్నా భాటియా. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. మధుర్ బండార్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫాక్స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దర్శకుడు రూపొందిస్తున్నాడు.
ఈ సందర్భంగా దర్శకుడు ‘గతంలో తాను తెరకెక్కించిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండనుంది.బాక్సర్ టౌన్‌గా పేరు గాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్‌డ్రాప్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో తమన్నా ఓ మహిళ బౌన్సర్‌గా నటిస్తున్నారు. దేశంలోని తొలిసారిగా ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని వెల్లడించాడు’.
అనంతరం తమన్నా మాట్లాడుతూ తన కెరీర్లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్రలో కనిపించడం ఆనందంగా ఉంది. ఓ ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. మధుర్ దర్శకత్వంలో తొలిసారిగా నటించడం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులు నన్ను మరింత ఆదరిస్తారని అశిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘ఎఫ్3’, ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
Excited to see @imbhandarkar’s new muse @tamannaahspeaks after @priyankachopra, @konkonas, #Tabu, #KareenaKapoorKhan. Congratulations @JungleePictures & @foxstarhindi for #BabliBouncer! Sending lots of love and luck to the team. Filming begins today 🌸 pic.twitter.com/kT79O5X73Q
— Rohit Bhatnagar (@justscorpion) February 18, 2022