Gopichand Malineni | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. బ్లాక్బస్టర్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఘన విజయం తర్వాత ఈ ఇద్దరూ కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్బీకే111 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ 26న పూజ కార్యక్రమాలు జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్గా తమిళ బ్యూటీ నయనతార నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకుంది. గతంలో వీరిద్దరూ ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో ఇప్పుడు నాలుగోసారి ఈ జంట జోడి కట్టబోతుంది.
ఇది చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే ఒక శక్తిమంతమైన యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక పాత్రలో రాజుగా అలరించనున్నారని సమాచారం. ఈ పాత్ర బాలయ్య అభిమానులకు పెద్ద విందు కానుంది. ఈ భారీ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
The Queen who carries the Calm of Oceans and the Fury of Storms, #Nayanthara enters the empire of #NBK111 💥💥
Warm birthday wishes from the team ❤️
HISTORICAL ROAR loading… with gigantic updates soon ❤️🔥#HBDNayanthara
GOD OF MASSES… pic.twitter.com/RETlqAoCKI— Vriddhi Cinemas (@vriddhicinemas) November 18, 2025