Arjith shankar | ఇండస్ట్రీ ఏదైనా వారసులు మాత్రం వస్తూనే ఉన్నారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరైనా తమ కొడుకులను నటన వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇప్పుడు తమిళ దర్శకుడు శంకర్ వారసుడు కూడా ఇండస్ట్రీకి వస్తున్నాడు. శంకర్‌కు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. శంకర్ సినిమాలు ఇక్కడ కూడా విజయం సాధించాయి. దాంతో శంకర్ ఏం చేసినా కూడా రెండు ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అవుతుంది. కొన్నేండ్లుగా సరైన ఫామ్‌లో లేడు ఈ దర్శకుడు. నిజం చెప్పాలంటే 2010లో విడుదలైన రోబో తర్వాత ఈ మేరకు మరో విజయం రాలేదు. మధ్యలో వచ్చిన స్నేహితుడు డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఐ, 2.0 కూడా అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకోలేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న శంకర్.. రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే హిందీలో అపరిచితుడు రీమేక్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన వారసుడు ఇండస్ట్రీకి రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ శంకర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇటీవలే పెద్ద కూతురు ఐశ్వర్యపెండ్లి అయింది. రెండో కూతురు అదితి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇప్పుడు హీరోయిన్గా వస్తుంది. కార్తి విరువాన్ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇప్పుడు శంకర్ కొడుకు అర్జిత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 2005లో సంచలన విజయం సాధించిన ప్రేమిస్తే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. తమిళంలో కాదల్ పేరిట వచ్చిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాతోనే శంకర్ కొడుకు అర్జిత్ హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను అప్పట్లో బాలాజీ శక్తివేల్ తెరకెక్కించాడు. శంకర్ నిర్మించాడు. ఇప్పుడు కూడా శంకర్ సినిమాలోనే ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రేమిస్తే సీక్వెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా శంకర్ కొడుకు లాంఛింగ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Sunil About RC 15 | శంకర్ సినిమాకు సునీల్ పేరు రెఫర్ చేసిందెవరంటే..?
RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
RC15 | ఒక్క పాటకే 25 కోట్లా.. మరి సినిమా టోటల్ బడ్జెట్ ఎంత?
Ram Charan: రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యునరేషన్ తెలిస్తే నోరెళ్లపెడతారు..!
7 నిమిషాలు.. 70 కోట్లు.. చరణ్ కోసం శంకర్ బీభత్సం..
RC 15: హిస్టరీలో ఇదే తొలిసారి.. 80 మంది ఫారెన్ డ్యాన్సర్స్‌తో ఫీట్ చేయనున్న చరణ్