7 నిమిషాలు.. 70 కోట్లు.. చరణ్ కోసం శంకర్ బీభత్సం..

RC15 budget | రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2022 మధ్యలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్‌లో 50వ సినిమాగా RC15 నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్లు అద్భుతమైన పొలిటికల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు శంకర్. కొందరు సినిమా ఒకే ఒక్కడు సీక్వెల్ అంటున్నారు. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా కోసం రూ.250 కోట్ల బడ్జెట్ దిల్ రాజు కేటాయించినట్లు తెలుస్తోంది. దాన్ని మించకుండా సినిమా ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు శంకర్‌కు నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శంకర్ కూడా బడ్జెట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నాడు.

మొన్న విడుదలైన RC15 కాన్సెప్ట్ పోస్టర్ కోసం కోసం ఏకంగా 1.73 కోట్ల ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పోస్టర్లో సినిమాకి పనిచేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉన్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు శ్రీకాంత్, సునీల్, జయరామ్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కేవలం కాన్సెప్ట్ పోస్టర్ కోసమే 1.73 కోట్లు ఖర్చు పెట్టేస్తే.. సినిమా అంత తీయడానికి శంకర్ ఎంత బడ్జెట్ పెట్టిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశం కోసం శంకర్ ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏడు నిమిషాల పాటు జరిగే ఈ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశం ఇదే అని.. అందుకే ఖర్చుకు వెనకాడకుండా తీస్తున్నారని తెలుస్తోంది.

ఇదివరకు 70 కోట్ల బడ్జెట్ మొత్తం సినిమాకు కూడా ఎప్పుడూ పెట్టలేదు దిల్ రాజు. కానీ ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో జత కట్టిన తర్వాత ఒక్క సీక్వెన్స్ కోసమే 70 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. మీరు ఎవరితో పెట్టుకున్నారో ఇప్పటికైనా మీకు అర్థం అవుతుందా రాజు గారు అంటూ మీమ్స్ వస్తున్నాయి. సినిమా అయిపోయే లోపు ఈజీగా 250 కోట్లు కాదు కదా దానికి మరో 50 కోట్లు అదనంగా శంకర్ ఖర్చు పెట్టిస్తాడు అంటూ ట్రేడ్ వర్గాల నుంచి వార్తలు బాగానే వస్తున్నాయి. ఖర్చు పెట్టించడం కాదు పెట్టిన ప్రతి రూపాయి మళ్లీ వెనక్కి వస్తుందా లేదా అనేది కీలకం. మరి అది వస్తుందా లేదా అనేది సస్పెన్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
Ram Charan: లాంచింగ్ వేడుకలో రామ్ చరణ్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?
RC 15 Poster| కేవలం పోస్టర్ కోసమే శంకర్ కోట్లు ఖర్చు పెట్టించాడా..?
RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై అనుమానాలు..మీరెక్కడ దొరికారురా అంటూ ట్వీట్
RRR: ఆర్ఆర్ఆర్ డైలాగ్ చెప్పిన రాజమౌళి.. షాకవుతున్న ఇండస్ట్రీ వర్గాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dil raju
- ram charan
- rc15
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

