RRR: ఆర్ఆర్ఆర్ డైలాగ్ చెప్పిన రాజమౌళి.. షాకవుతున్న ఇండస్ట్రీ వర్గాలు

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాని పీరియాడికల్ మూవీగా తెరకెక్కించారు. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రాజమౌళి పలు సందర్భాలలో చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్‌దేవ్, దర్శకుడు రాజమౌళి, వైద్యులు రవి తంగరాల పాల్గొన్నారు.
కపిల్ దేవ్ క్రికెట్ ఆడిన నాటి రోజులు గుర్తుచేసుకుంటూ… ఆర్ఆర్ఆర్ మూవీ డైలాగ్ ను కూడా చెప్పేశాడు రాజమౌళి. ” నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి” … ఇదీ ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన డైలాగ్. చారిటీ ప్రోగ్రామ్ కు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్న సందర్భంగా.. రాజమౌళి ఈ మాటలు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి. భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rajamouli
- ram charan
- rrr movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

