Ram Charan: లాంచింగ్ వేడుకలో రామ్ చరణ్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

సినీ సెలబ్రిటీలు వాడే ఏ వస్తువైన అభిమానులకి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. వారి బట్టలు, బ్యాగులు, వాచ్‌లు,క్యాప్‌లు ఇలా ప్రతీ దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటి ధరలు తెలుసుకుంటూ ఉంటారు. ధర తెలిసాక వారు నోరెళ్లపెడుతుంటారు. తాజాగా రామ్ చరణ్ వాచ్ హాట్ టాపిక్‌గా మారింది.
బుధవారం రామ్ చరణ్ 15వ సినిమాకు సంబంధించిన లాంచింగ్ వేడుక ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై, మూవీ టీంకి విషెస్ తెలియజేశారు. ముహూర్తపు సన్నివేశానికి చిరు క్లాప్ నివ్వగా, రణ్వీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న గౌరవ దర్శకత్వం వహించారు.
అయితే చరణ్ ఈ వేడుకలో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఆయన కాస్ట్లీ వాచ్‌తో ఈ కార్యక్రమానికి హాజరు కాగా, ప్రస్తుతం చరణ్ వాచ్ హాట్ టాపిక్‌గా మారింది. ఒలంపిక్స్‌లో 100 ఇంకా 200 మీటర్స్‌లో ప్రపంచ రికార్డ్ సాధించి ఫాస్టెస్ట్ రన్నర్‌గా నిలిచిన యోహన్ బ్లేక్ కోసం రిచర్డ్ మిల్లే కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారట. రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ వాచ్‌ని ఇప్పుడు చెర్రీ ధరించగా, ఆ వాచ్ ఖరీదు మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 1.02 కోట్లు.
50.23 మిల్లీ మీటర్స్ హైట్, 42.70 విడ్త్‌తో హ్యాండ్ వైండింగ్ టైప్ స్కెలిటన్ కాంప్లికేషన్లో.. బ్లాక్ రబ్బర్ స్ట్రిప్‌తో.. ఎల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ ఉండడంతో పాటు పైన ఉన్న సాప్ఫైర్ గ్లాస్ ఈ వాచ్‌కి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ వాచ్‌కి రిస్ట్ రన్ మిషన్ వాచ్‌గా పేరుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram charan
- RC 15
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

