టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఆర్సీ 15 (RC15) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ కైరా అద్వానీ (Kiara Advani) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ మూవీలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టులో సునీల్ (Sunil)ఎలా ఛాన్స్ కొట్టేశాడన్న దానిపై ఓ అప్ డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ చేస్తున్న భారీ ప్రాజెక్టులో ఎలా అవకాశమొచ్చిందో చెప్పుకొచ్చాడు సునీల్. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుకు తన పేరును సూచించినట్టు సునీల్ చెప్పాడు. అయితే దిల్ రాజు తన పేరును రెఫర్ చేసినప్పటికీ డైరెక్టర్ శంకర్ మాత్రం సునీల్ నటించిన సినిమాలపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేశాడట. క్యారెక్టర్లకు నటీనటులను ఎంపిక చేసే విషయంలో చాలా పర్ఫెక్షన్తో ఉండే శంకర్ మొత్తానికి అలా సునీల్ ను తన సినిమాలో కీలక పాత్ర కోసం తీసుకున్నాడన్నమాట.
మరి ఈ క్రేజీ సినిమా సునీల్ కెరీర్ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీలో అంజలి, జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.