Robo Shankar : తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ (Robo Shankar) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూనే గురువారం మరణించాడు. శంకర్ తుది శ్వాస విడవడంతో భార్య ప్రియాంక, కూతురు ఇంద్రజ శంకర్, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన అతడిని కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ జీఈఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించాడు. ఈమధ్యే కామెర్ల వ్యాధి నుంచి కోలుకున్న శంకర్ బరువు బాగా తగ్గిపోయాడు. సన్నబడిన అతడిని చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే.. కుకింగ్ షోలో పాల్గొన్న అతడు ప్రేక్షకులను మునపటిలానే మెప్పించాడు. ఈసారి ఆరోగ్యం విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.
காலமானார்!#RoboShankar | #RIPRoboShankar | #CinemaNews | #ActorRoboShankar pic.twitter.com/DXzZtAospm
— News7 Tamil (@news7tamil) September 18, 2025
తమిళ టీవీ, సినిమాల్లో శంకర్ పాపులర్. గ్రామ్లాలో, టీవీల్లో రోబో వేషం వేసినందుకు అతడి పేరు రోబో శంకర్‌గా స్థిరపడిపోయింది. కమల్‌హాసన్‌కు వీరాభిమాని అయిన శంకర్ 1997 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. రజినీకాంత్ చిత్రం ‘పడయప్పా’లో సపోర్టింగ్ రోల్ చేసిన శంకర్‌కు విజయ్ సేతుపతితో కలిసి నటించిన ‘ఇంద్రకుథానే ఆసైపట్టాయ్ బాలాకుమారా’ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ‘మారీ’, ‘సింగపూర్ సెలూన్’, ‘వెలైను వంధుట్ట వెల్లకరన్’, ‘కడవుల్ ఇరుకాన్ కుమరు’, ‘పా పాండీ’, ‘వేలైక్కరన్’, ‘విశ్వాసం’.. ‘ఇరుంబు థిరాయ్’ వంటి చిత్రాల్లో శంకర్ నటించారు.