Manchu Lakshmi | మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటిస్తూ నిర్మించిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’. ఈ మూవీ 19న విడుదల కానున్నది. ఈ క్రమంలో ఆమె సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. ఈక్రమంలో మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “ఇటీవల నేను ముంబయిలోనే ఉంటున్నాను. అక్కడినుంచే నా పని వ్యవహారాలన్నీ చూస్తున్నాను. ముంబయి లైఫ్‌స్టైల్ నాకు చాలా ఇష్టం. పొద్దున్నే లేచి పని కోసం పరుగెత్తడం నాకు నచ్చుతుంది” అని లక్ష్మి చెప్పారు. ముంబయికి వెళ్లేందుకు ప్రేరణ రానా దగ్గుబాటి అని తెలిపింది. “రానాకి అక్కడ ఇల్లు ఉంది. అలాగే చరణ్‌కీ సొంత ఇల్లు ఉంది. మా అందరికంటే ముందే సూర్య అక్కడికి వెళ్లారు.
ప్రస్తుతం నేను రెంటుకే ఉంటున్నాను. అక్కడ తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్‌లను అప్పుడప్పుడూ కలుస్తుంటాను. నేను ఎక్కడ ఉన్నా ఇతరులకు ధైర్యం ఇచ్చేలా ఉండాలనేదానిపైనే నా దృష్టి. పిరికితనంగా బ్రతకమని ఎప్పుడూ చెప్పను” అంటూ చెప్పింది. ఇటీవల వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. “నాకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇల్లు అమ్మకానికి పెట్టాను అని వార్తలు వచ్చాయని.. కానీ తనకు సొంత ఇల్లే లేదని.. అలాంటప్పుడు ఎక్కడి ఇల్లు అమ్మకానికి పెడతాను? అని ప్రశ్నించింది. ఫిల్మ్‌నగర్‌లో ఉన్నది నాన్నగారి ఇల్లు అని.. గతంలో తాను అక్కడ ఉన్నాను అంతేనని తెలిపింది. ఆ ఇంటితో నాకిప్పుడు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది ఆర్థికంగా సమస్యలు ఉన్న మాట నిజమేనని.. కానీ అలాంటి స్థితిలోనూ ఎలా ముందుకు పోవాలో నేర్చుకుంటూ.. పట్టుదలతోనే ముందుకు కొనసాగుతున్నానని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.