Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రాజెక్టు నుంచి తప్పించారు. ఈ మేరకు నిర్మాత సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గతేడాది వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో కల్కి రెండో పార్ట్ చిత్రీకరణ మొదలుకానున్నది. ఈ క్రమంలో తొలి ఫార్ట్లో సుమతి పాత్రలో అద్భుతంగా నటించిన దీపికాను తప్పించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్ చిత్రాలను తెరక్కిస్తుంటారు నిర్మాత అశ్వనీదత్. ఆయన బ్యానర్లో వచ్చిన కల్కి మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే కల్కి ప్రాజెక్టులో దీపికా భాగం కాబోరని వైజయంతి మూవీస్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
అయితే, దీపికానే ప్రాజెక్టు నుంచి తప్పుకుందా? లేదంటే తప్పించారా? అనే అనుమానాలున్నాయి. అయితే, బాలీవుడ్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపికా తన రెమ్యునరేషన్‌ను దాదాపు 25శాతం వరకు పెంచారని టాక్. అదే సమయంలో తన సిబ్బందికి సైతం ఫైవ్ స్టార్ సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా షూటింగ్‌కు ఏడు గంటలు మాత్రమే వస్తానని కండీషన్ పెట్టినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజమున్నదో తెలియదు. కానీ, వైజయంతి మూవీస్ పెట్టిన ట్వీట్ ఒక అంశం ‘నిబద్ధత’ మాత్రం చర్చనీయాంశంగా మారింది. పారితోషకంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించడం లేకపోతే.. చర్చలు జరిపి సిబ్బందిని పరిమితం చేయడం మేకర్స్‌కు పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. కానీ, కల్కిలాంటి సినిమాను తీర్చిదిద్దేందకు చాలా సమయం పడుతుంది. మూవీ మేకింగ్‌పై అనేక ఇతర అంశాలు సైతం ప్రభావితం చూపిస్తుంటాయి.
ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్ సహా స్టార్ సైతం నటించిన విషయం తెలిసిందే. వారితో కాంబినేషన్ సీన్స్ తీసే సమయంలో పని గంటలు మాత్రం షూటింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో షూటింగ్ సమయం పెంచడంతో పాటు బడ్జెట్ సైతం అదుపు తప్పే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అన్నీ పరిశీలించి.. దీపికను కల్కి నుంచి పక్కన పెట్టి ఉంటారని సమాచారం. వాస్తవానికి ప్రభాస్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ ఇప్పటికే మొదలుకావాల్సి ఉంది. పలు కారణాలతో ఆలస్యమవుతూ వస్తున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా దీపికాను తీసుకోవాలని భావించారు. ఆమె పెట్టిన కండీషన్స్‌ను తట్టుకోలేక మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఈ మూవీలో త్రిప్తి డిమ్రీకి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఈ సమయంలో దీపికా పేరు పెట్టకుండా సందీప్ వంగా చేసిన పోస్ట్ అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరో వైపు కల్కిలో దీపిక నటించిన సుమతి పాత్రకు రెండో పార్ట్‌లో మంచి ప్రాధాన్యం ఉండనున్నది. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు కల్కి చుట్టూనే కథ నడువనున్నది. సుమతికి రక్షకుడైన అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్), భైరవ (ప్రభాస్) మధ్య తొలి పార్ట్‌లో హోరాహోరీగా పోరాడిన విషయం తెలిసిందే. సుప్రీం యాస్కిన్‌గా నటించిన కమల్‌హాసన్ నటించిన విషయం తెలిసిందే. సుమతి పాత్రకు ఎవరికి తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. కల్కీ-2 షూటింగ్ ఈ ఏడాది చివరి నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తున్నది.