Ashwin : ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) కొత్త లీగ్‌లో ఆడడం ఖరారైపోయింది. బిగ్‌బాష్ లీగ్, ఇంటర్నేషనల్ 20 వంటి లీగ్స్‌ను కాదని హాంకాగ్స్ సిక్సెస్(Hong Kong Sixes)కు జై కొట్టాడీ వెటరన్. ట్విస్ట్ ఏంటంటే.. అతడు మళ్లీ భారత జట్టుకు ఆడబోతున్నాడు. ఈ టోర్నీ రూపంలో అశ్విన్‌కు మరొకసారి దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కనుంది. తొమ్మిది నెలల తర్వాత ఈ స్పిన్ దిగ్గజం మాజీ సహచరులతో కలిసి మైదానంలోకి దిగనున్నాడు.
హాంకాంగ్ సిక్సెస్‌లో ఆడే అవకాశం రావడంపై అశ్విన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘చిన్నప్పుడు మనమంతా టీవీలో హాంకాంగ్ సిక్సెస్ మ్యాచ్‌లు చూశాం. వీడ్కోలు తర్వాత నేను చేరాలనుకున్న ఆసక్తికరమైన ఫార్మాట్ ఇది. ఈ ఫార్మాట్‌కు ప్రత్యేకమైన వ్యూహం అవసరం. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. మజీ సహచరులతో మరోసారి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ప్రత్యర్థి జట్లతోని మేటి ఆటగాళ్లతో తలపడనున్నందుకు థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నా. ఇది నిజంగా మాకు మంచి సవాల్’ అని అశ్విన్ వెల్లడించాడు.
Legendary Indian spinner Ravichandran Ashwin ( @ashwinravi99 ) is set to light up Hong Kong!
He’ll be a key part of Team India at the @hongkongsixes 2025, happening from 7–9 November.
Fans will get the rare chance to watch Ashwin’s wizardry in the fastest, most entertaining… pic.twitter.com/erpz6BQDnl
— Cricket Hong Kong, China (@CricketHK) September 18, 2025
నిరుడు ఎడిషన్‌లో రాబిన్ ఊతప్ప, మనోజ్ తివారీ, షాబాజ్ నదీమ్, స్టువార్ట్ బిన్నీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాదినవంబర్ 7 నుంచి నవంబర్ 9.. మూడు రోజుల పాటు లీగ్ జరుగనుంది. హాంకాంగ్ సిక్సెస్ తొలి సీజన్ 1992లో మొదలైంది. ఈ టోర్నీలో పన్నెండు జట్లు పోటీ పడుతాయి. ఒకదాంట్లో మూడు చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే లీగ్ దశలో.. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీఫైనల్.. క్వార్టర్స్‌లో ఓడిన జట్లు ప్లేట్ సెమీస్ ఆడుతాయి. అయితే.. టీ20 ఫార్మాట్ తరహాలో కాకుండా ఆరు ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారు. చెప్పాలంటే అదే ఈ టోర్నీ ప్రత్యేకత.