Vijay Thalapathy | తమిళ స్టార్ దళపతి విజయ్ ( Thalapathi Vijay) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ స్టార్ ఇటీవలే ఓ రాజకీయ పార్టీని కూడా నెలక్పొలాడు. ‘తమిళగ వెట్రి కళగం’ (Tamizhaga Vetri Kazhagam) పేరుతో పార్టీని స్థాపించారు. విజయ్‌కు సామాజిక సేవ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. వదర బాధితులకు, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేయడంలో ముందుంటారు. అదే సమయంలో విద్యార్థులకు సాయం చేయడంలో కూడా విజయ్ ఏ మాత్రం వెనుకాడరు. వారిని ప్రోత్సహించేందుకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తుంటారు.
ఇక గతేడాది ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి విజయ్ ఏకంగా డైమండ్ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పై చదువుల కోసం తనవంతుగా ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకోబోతున్నారు. ఇటీవలే తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో వెలువడిన పది, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు తాజాగా ప్రకటించారు.
జూన్ 28, జులై 8 తేదీల్లో చెన్నైలోని శ్రీ రామచంద్ర కన్వెన్షన్ సెంటర్లో (Sri Ramachandra Convention Centre) ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ (10th and 12th toppers) టాప్ 3లో నిలిచిన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వారికి సర్టిఫికెట్‌తోపాటు రివార్డులను కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గోట్’ చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Raayan | రాయన్ విడుదలపై క్లారిటీ.. కొత్త లుక్‌తో ధనుష్ రిలీజ్ అప్డేట్
Alamgir Alam: జైలు పాలైన జార్ఖండ్ మంత్రి రాజీనామా