Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ధనుష్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ స్వీయ దర్శకత్వంలో రాయన్ (Raayan). గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీని తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా రాయన్ విడుదల తేదీపై నెలకొన్ని డైలామాకు చెక్ పెట్టాడు ధనుష్. ఈ చిత్రాన్ని జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్స్ షేర్ చేశాడు. ఈ స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచుతున్నాయి.
ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అపర్ణ బాలమురళి,సందీప్ కిషన్ మధ్య సాగనున్న పాటకు మంచి స్పందన వస్తోంది. డీ50వ (D50)గా తెరకెక్కుతోన్న రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది.
రాయన్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది.
ధనుష్ రిలీజ్ అప్డేట్..
#Raayan From July 26th pic.twitter.com/2UaNocSTm3
— Dhanush (@dhanushkraja) June 10, 2024
#Raayan is set for a grand release in Andhra Pradesh and Telangana by @asiansureshent🔥🔥
In cinemas from June 2024!@dhanushkraja @arrahman @PDdancing @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/jx1kXuw797
— Asian Suresh Entertainment (@asiansureshent) May 10, 2024
రాయన్ ట్రిపుల్ బొనాంజా..
🔜 #RaayanFirstSingle – #AdangaathaAsuran | #ThalaVanchiEragade | #KoiTodNaIska, releasing today at 6pm🥳. Get set to enjoy the song in Telugu and Hindi as well 😉#Raayan in cinemas from June 2024! @dhanushkraja @sunpictures @prabhudevaofficial @iam__sjsuryah @selvaraghavan… pic.twitter.com/JkikABHEye
— A.R.Rahman (@arrahman) May 9, 2024
As #Indian2 gets postponed, Now #Dhanush‘s #Raayan is going to utilise that June-13 slot💥
The next biggie from Kollywood 🔥🔥 pic.twitter.com/Xp6CASdzGH— AmuthaBharathi (@CinemaWithAB) May 6, 2024