Suriya | సూర్య పేరుకు తమిళ హీరో కానీ తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు సూర్య. 17 ఏండ్ల కిందట వచ్చిన గజినీ సినిమాతో తెలుగులో సంచలన విజయం అందుకొని దాదాపు 10 కోట్ల మార్కెట్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా యముడు, 24 లాంటి విజయాలతో తెలుగులో సూర్యకు దాదాపు 15 కోట్ల మార్కెట్ ఏర్పడింది. అయితే కొన్నేళ్లుగా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో పెరిగిన మార్కెట్ మొత్తం పడిపోయింది. విజయ్ కంటే ముందుగానే మార్కెట్ సంపాదించుకున్న సూర్య.. ఇప్పుడు ఆయన కంటే ఎంతో వెనుకబడిపోయాడు.
ఒకప్పుడు సూర్య సినిమా అంటే ఎగబడి తీసుకునే డిస్ట్రిబ్యూటర్లు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. NGK, సింగం 3, బందోబస్త్ లాంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో సూర్య మార్కెట్ భారీగా పడిపోయింది. ఓటీటీల్లో విడుదలై సంచలన విజయం సాధించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూర్య థియేట్రికల్ మార్కెట్ పెంచలేకపోయాయి. ఈ రెండు సినిమాలు అంత పెద్ద విజయం సాధించినా సూర్యకు కలిసొచ్చింది ఏమీ లేదు. సూర్య అప్ కమింగ్ సినిమా ‘ఎతర్కుమ్ తునింధవం’ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
కార్తితో చినబాబు సినిమా చేసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను 10 కోట్లకు ఆఫర్ చేస్తే .. అందులో సగం పెట్టి కొనడానికి కూడా బయ్యర్లు ముందుకు రావడం లేదు. చివరికి ఒక చిన్న నిర్మాత ‘ఎతర్కుమ్ తునింధవం’ చిత్ర తెలుగు హక్కులను కేవలం 4 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు 15 కోట్లకు పైగా పలికిన సూర్య సినిమా డబ్బింగ్ రైట్స్.. 4 కోట్లకు పడిపోయిందంటే అంత కంటే దారుణమైన అవమానం మరొకటి లేదు. ఈ సినిమా విజయం సాధిస్తే కానీ తెలుగులో మళ్లీ సూర్యకు పునర్వైభవం రాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Good Luck Sakhi Review | కీర్తి సురేశ్ గుడ్ లక్ సఖి పరిస్థితి ఏంటి.. హిట్టు కొట్టిందా..?
త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ మరదలిగా ఆ మలయాళ బ్యూటీ?
ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా పుష్ప హిందీలో అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా…?
Jai Bhim | ఆస్కార్ ఛానెల్లో జైభీమ్.. సూర్య సినిమాకు అరుదైన ఘనత..
Jyothika: సూర్యకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. దాని వలన నేను స్ట్రెస్ ఫీలవుతుంటా: జ్యోతిక