Good Luck Sakhi Review | కీర్తి సురేశ్ గుడ్ లక్ సఖి పరిస్థితి ఏంటి.. హిట్టు కొట్టిందా..?

Good Luck Sakhi Review | తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోయిన్లు అరుదుగా ఉన్నారు. అనుష్క తర్వాత ఆ స్థాయిలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటి సినిమా తర్వాత ఈమెకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మిస్ ఇండియా, పెంగ్విన్ అంటూ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది కీర్తి సురేశ్. ఈ క్రమంలో ఆమె చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి.
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నగేశ్ కుకునూర్ తెరకెక్కించిన గుడ్ లక్ సఖి సినిమాపై ముందు నుంచి కూడా అందరికీ బాగానే ఆసక్తి ఉంది. పైగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ట్రైలర్ బాగుండటం.. అవార్డు విన్నింగ్ టెక్నీషియన్స్ పనిచేయడంతో కచ్చితంగా గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేశ్ ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు విడుదల తర్వాత అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లు ఉంది పరిస్థితి. జనవరి 28న ఏపీ తెలంగాణలో దాదాపు 550 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. సోలో రిలీజ్ దొరకడంతో పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ వేసుకున్న అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా నామమాత్రంగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కనీసం 35 శాతం ఓపెనింగ్స్ కూడా గుడ్ లక్ సఖి సినిమాకు రాలేదని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
తన పాత్ర వరకు కీర్తి సురేశ్ అదరగొట్టింది. జగపతి బాబు, ఆది పినిశెట్టి కూడా బాగానే నటించారు. కానీ నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, నెరేషన్ తోనే అసలు సమస్య వచ్చిందని అంటున్నారు ప్రేక్షకులు. మహానటి సినిమా తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కీర్తి సురేశ్ తడబడుతుందని ఆమె చేస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ పడితే తప్ప ఇకపై ఈమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయరని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
చరణ్, కీర్తి మధ్య సూపర్ కెమిస్ట్రీ, జంటగా సినిమా ఎప్పుడో మరి
Keerthy Suresh | వెరైటీ చీరకట్టులో కీర్తి సురేష్ అదిరిపోయే ఫొటోషూట్..
Keerthy Suresh | చీరకట్టులో కైపెక్కిస్తున్న మహానటి..
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

